Sunday, December 13, 2009

SALEEM......MOVIE REVIEW





దుమ్మురేపని "సలీం"....................


ఓవరాల్ గా...'హలీం' మింగుడు పడుతుందేమో కానీ 'సలీమ్' మింగుడుపడడు(దు)...............



FINAL ANALYSIS : "ఎడిసినట్టు ఉంది.........." FLOP...........Mixing of "DEVDAS" n "OKKA MAGADU" movies...........waste movie with out story...... n screenplay......





తమ ప్రేమను విఫలం చేసేందుకు ప్రేయసిని ఖండాంతరాలకు పట్టుకుపోతే ఆగమేఘాల మీద అక్కడకు చేరుకుని ఆమెను దక్కించుకోవడం నేటి 'దేవదాసు' స్టయిల్. దర్శకుడు వై.వి.ఎస్. చౌదరి ఈ ఫార్ములాను బాగా ఒంటపట్టించుకుని మోడ్రన్ 'దేవదాసు'ను తెరపైకి తేస్తే జనం విరగబడి చూశారు. ఇప్పుడు 'సలీమ్' వంతు వచ్చింది. మళ్లీ సేమ్ ఫార్ములా. కాకపోతే నిన్నటి 'దేవదాసు' తన ప్రేయసి కోసం అమెరికా చుట్టొస్తే, ఇవాల్టి 'సలీమ్' ఇంకో అడుగు ముందుకు వేసి బ్యాంకాక్, యూరప్ వంటి పలు దేశాలు చుట్టేస్తాడు.............సారికీ మీకు కథ మొత్తం అర్ధం అయ్యిఉంటుంది........



సినిమా ప్రథమార్థం ఇలియనా (నాభి చుట్టూ కెమెరా లెక్కలు మించి చక్కర్లు కొట్టింది) గ్లామర్ పైన, ద్వితీయార్థం మోహన్ బాబు, కావేరీ ఝా రొమాంటిక్ ఎ'ఫైర్' పైన దర్శకుడు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తుంది..................





PERFORMANCE




DIRECTOR : Y.V.S CHOWDARY.......ఇస్తే "హిట్" లేకపోతే "ఫట్టు" అది కూడా మామోలు గ కాదు పెట్టిన పెట్టుబడి కూడా రాదు..........'ఒక్క మగాడు' వంటి ఫెయిల్యూర్ తర్వాత కూడా సరైన స్క్రిప్టును నమ్ముకోకుండా సాంకేతక హంగులు, ఫారెన్ లొకేష్లన్ల మీదే ఆధారపడటం విస్పష్టంగా కనిపిస్తుంది.......మరోవైపు ఊదరగొట్టుడు 'ఫ్లాష్ బ్యాక్'లు, సమయ సందర్భాలు లేకుండా పాటలు గుప్పించడం సహనానికి పరీక్షే. .....



VISHNU : విష్ణు బరువు తగ్గి స్లిమ్ గా కనిపించడంతో పాటు కొన్ని కాస్ట్యూమ్స్ లో స్టైలిష్ గా ఉన్నారు. సంభాషణల ఉచ్చరణలోనూ ఇంప్రూవ్ మెంట్ కనిపించింది. ఫైట్స్, డాన్స్ లు చలాకీగా చేశారు. ........



ILIYANA : ఇలియానా ఇంతగా గ్లామర్ ఎక్స్ పోజ్ చేసిన సందర్భాలు గతంలో లేవు. తన గ్లామర్ లుక్స్, కాస్ట్యూమ్స్ తో కనికట్టు కట్టింది........నడుం నీ ఎన్నివంకర్లు తిప్పచో అన్ని విదాలు గా తిప్పింది........



అంతగా చదువు సంధ్యలు లేని డాన్ గా మోహన్ బాబు తన నట అనుభవాన్నంతా రంగరించిమంచి నటన ప్రదర్శించారు. అయితే మోహన్ బాబు ఇలాంటి పాత్రను ఎంచుకోవాల్సిన అవసరం ఉందా? అది హుందాతనం అనిపించుకుంటుందా అనే ఓ ప్రశ్న తలెత్తుతుంది. పాత్ర పరంగా తనకు ఇంగ్లీషు పాఠాలు చెప్పడానికి వచ్చే టీచర్ లో ఎరోటిక్ యాంగిల్ చూస్తుంటారాయన. ఎందుకు ఈ ప్రస్తావన అంటే...శ్రీ విద్యానికేతన సంస్థలకు మోహన్ బాబు అధిపతి కూడా. సినిమాలో టీచర్ జాకెట్ ముడి విడిపోతే కట్టడం, ఓ సాంగ్ కూడా వేసుకుంటారు. కావేరీ ఝా పాత్ర గ్లామర్ ప్రదర్శనకే పరిమితమైంది.......మిగతా వాళ్ల గురుంచి మాట్లాడుకోవడం సుద్ద దండగ........



సందీప్ చౌతా సంగీతం అందించిన పాటల్లో 'మామామియా' మినహాయిస్తే ఒక్కపాట కూడా జనాలకు పట్టదు. సాహిత్యాన్ని (చాలా చోట్ల అర్థమే కాదు) బీట్ డామినేట్ చేయడంతో పాటు ఒకపాట అయితే డబ్బాల్లో గుళకరాళ్ల చందంలా ఉంది........





PRESENTS




ఈ కథ వినే కంటే "హరికధ" వినడం చాల ఉత్తమం.....సో...ఇంకో సినిమా రివ్యూ కోసం వెయిట్ చేయండి...

0 comments:

Post a Comment

 

CinemaSeva - సినిమా సేవ Copyright © 2009 WoodMag is Designed by Ipietoon for Free Blogger Template