బ్రహ్మ....యమ....మనిషి......కాసేపు మాయాజాలం.....
FINAL ANALYSIS : FLOP.........But Stricklly for B,C Centres........Nothing is Offering in this Flick only Graphics and RajendraPrasad Acting is Plus Points.....Remaining Didn't Get Even Deposit in AUDIANCE VOTING.........
దేవతలు భూలోకంవచ్చి మానవుల గురించి పడినపాట్లు తెలుగు ప్రేక్షకులు సుపరిచితమే. వినోదాన్ని కల్గించే ఇటువంటి కథాంశాలతో యమదొంగ, యమగోల, యమలీల వచ్చాయి. ఇక బ్రహ్మప్రస్తావనకి వచ్చేసరికి మూడు మూaఖాలుగా చూపించి అందులో రెండుముఖాలు డ్రామా ముఖాలు పెట్టడడం ఆనవాయితీ. మారిన సాంకేతిక పరిజ్ఞానంరీత్యా చతుర్ముఖుడైన బ్రహ్మను అసలు మొఖాలుగా చూపించడం 'బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం' ప్రత్యేకత. బ్రహ్మగా డా|| రాజేంద్రప్రసాద్ అమరారు. పాత్రోచితంగా ఇతర పాత్రలూ ఉన్నాయి. ఎటొచ్చీ కథలో ప్రధాన భాగం శోభనం గురించే కావడం కాస్త మింగుడు పడని విషయమే.
చంద్రలోకం, సూర్యలోకం తర్వాత ఉండేదే సత్యలోకం. కథ అక్కడ ఆరంభమవుతోంది. మానవుల తల రాతలు రాసే బ్రహ్మ (రాజేంద్రప్రసాద్) కు నారదుని (అశోక్‌కుమార్) వల్ల తన భార్య సరస్వతి (కళ్యాణి)తో చిన్నపాటి వాగ్వివాదం జరుగుతుంది. దాంతో ఏమరుపాటుగా అప్పుడే పుట్టిన ఆడశిశువుకు 'వివాహం తర్వాత మరణం' అంటూ లిఖిస్తాడు. భూలోకంలో శ్రీను (శివాజీ) గత ఐదేళ్ళుగా డిగ్రీపై కుస్తీపడుతుంటాడు. అయితే వివాహం చేసుకోవాలనే కోరిక బలంగా ఉంటుంది. జూనియర్ అయిన శ్వేత (సోనియా)ను మొదటిచూపులోనే ప్రేమించేస్తాడు. శ్వేత బావ శంకర్‌జాక్సన్ (రఘుబాబు)కు ఇది గిట్టదు. తన సోదరునితో ఆమె వివాహం చేయాలని పట్టుదలతో ఉంటాడు. మరోవైపు శ్రీను స్నేహితుడు శోభన్‌బాబు (వేణుమాధవ్) తన భార్య జ్యోతితో శోభనం జరక్క ఇబ్బందులుపడుతుంటాడు. దేవుడే తనకు దిక్కని అడవులకెళ్ళి బ్రహ్మగురించి తపస్సు చేస్తాడు. తప్పస్సుకుమెచ్చిన బ్రహ్మ శోభన్‌బాబుకు పాలతోకూడిన కలశం ఇస్తాడు. అది శుచిగా తాగితే నుదిటిరాత తెలుస్తుందంటూ మూడు కండిషన్లు పెట్టి ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. అయితే అనుకోనివిధంగా ఆ కలశం శ్రీనుకు దక్కుతుంది. ఆ వరాన్ని శ్రీను ప్రజల్ని కాపాడేందుకు వినియోగిస్తాడు. దీంతో చనిపోవాల్సినవారు బతికిపోతారు. ఇది యముని (జయప్రకాష్)ద్వారా గ్రహించిన బ్రహ్మ ఏంచేయాలని ఆలోచిస్తుండగా... ఆదిపరాశక్తి (లయ) ప్రత్యక్షమై ఆ వరాన్ని వెనక్కుతీసుకోని రమ్మని బ్రహ్మను భూలోకానికి పంపిస్తుంది. గడువులోపలే తేవాలనేది నియమం. ఆయనతోపాటు యమ, చిత్రగుప్తుడు, రంభ భూలోకానికి వస్తారు. అయితే చివరగా శ్రీను వరాన్ని ఇచ్చేందుకు సిద్ధపడి తన వివాహాన్ని దగ్గరుండి చేయమని వేడుకొంటాడు. కానీ ఆ తర్వాత శ్రీను శ్వేతపై నిందలుమోపి పెళ్లిచేసుకోనని భీష్మిస్తాడు.
పెండ్లయితేగానీ బ్రహ్మ తన వరాన్ని వెనక్కుతీసుకోలేడు. మరి బ్రహ్మ ఏంచేశాడు? దానికి శ్రీను ఎలా స్పందించాడు? అన్నది సినిమా. చతుర్ముఖబ్రహ్మగా గ్రాఫిక్ వర్క్‌తో రాజేంద్రప్రసాద్ పూర్తి న్యాయం చేశారు. భూలోకంలో వచ్చినతర్వాత హెచ్చుతగ్గుల్లేని అభినయం ఆకట్టుకుంది. నాలుగు ముఖాలు మాట్లాడే విధానం, దానికి స్పందించే తీరు బాగుంది. శివాజీ పాత్ర రొటీన్‌గానే ఉంది. మొదటి భాగమంతా అతనిపైనే సాగుతుంది. శ్వేత పాత్రలో సోనియా మామూలుగానే ఉంది. 'హ్యాపీడేస్' నుంచి హావభావాలు అతేతీరుగానే ఉన్నాయి. వేణుమాధవ్ పాత్రే కథను నడిపేది. పక్కా మాస్‌కామెడీని పండించాడు. రంభ పాత్రలో శ్రీనును ఆకట్టుకునే ప్రయత్నం చేయడంలో ఆర్తీఅగర్వాల్ సరిపోయింది. యముడైన జయప్రకాష్‌రెడ్డి డాన్స్ చేయడం ప్రత్యేకత. చిత్రగుప్తుడుగా ఏవీఎస్, హాంఫట్‌బాబాగా ఎం.ఎస్. నారాయణ, రఘుబాబు,కౌశ పాత్రలు పరిమితిమేరకే ఉన్నాయి.
ద్వందార్థాలకు దర్శకుడు ప్రాధాన్యత ఇచ్చాడు. అయినా టాలీవుడ్‌లో బ్రహ్మ పాత్రను దర్శకుడు గోళ్ళపాటి నాగేశ్వరరావు తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఎడిటింగ్ బాగున్నా, స్క్రీన్‌ప్లేలో లోపం స్పష్టంగా కన్పిస్తుంది. పదినిముషాలు బ్రహ్మ తన విధి చేయకపోతేనే ఎంతోమంది కాన్పులు ఆగిపోతాయని ఓ సన్నివేశంలో చెబుతాడు. అలాంటిది ఏకంగా ముప్పైరోజులపాటు భూలోకానికి రావడం, అతనితోపాటు యముడు, చిత్రగుప్తుడుకూడా రావడం సినిమాటిక్‌గా ఉన్నాయి. శ్రీలేఖ సంగీతం మామూలుగానే ఉంది. పరిమిత బడ్జెట్‌లోకూడా ఇటువంటి గ్రాఫిక్స్‌తో చిత్రం తీయవచ్చని నిరూపించారు నిర్మాతలు రేపేష్, బెక్కం వేణుగోపాల్. వాసు కెమెరా పనితం సత్యలోకం వరకు బాగానే ఉంది. భూలోకంలో వచ్చేసరికి లైటింగ్ సరిపోక కొన్ని సన్నివేశాలు డల్‌గా ఉన్నాయి. మొదటి భాగం శ్రీను, శ్వేతల ప్రేమాయణంతోనే సాగుతుంది. రెండవభాగంలోనే కథమలుపు తిరుగుతుంది. ఒక వర్గానికి మెచ్చే ప్రయత్నం చేశారు...........

0 comments:
Post a Comment