Monday, November 9, 2009

MAGADHEERA........100 DAYS SPECIAL REVIEW




MAGADHEERA....................ANSWER TO 78 YEARS TELUGU FILM INDUSTRY.






FINAL ANALYSIS : TREND SETTER......to SOUTHINDIAN

FILM INDUSTRY.....n SHOCK TO


BOLLYWOOD .........STARS



ఓవరాల్ గా 'మగధీర' ను గ్రేట్ ఫిల్మ్ అనడం కంటే...గ్రాండ్ లుక్ (టెక్నికల్ స్టాండర్డ్స్ ) ఉన్న కమర్షియల్ ఎంటర్ టైనర్ గా చెప్పొచ్చు




First time in FIRSTDAYFIRSTSHOW blog..that one movie got 100% excellent result..........We are appreciate every one in MAGADHEERA team.............We are happy to say that we are TOLLYWOOD people.........



వాస్తవం కంటే కలలు ఎప్పుడూ గొప్పగానే ఉంటాయి. కలలు కనడమే కాదు...పండించుకోవడమూ తెలియాలి. హాలీవుడ్ సినిమాల స్థాయిలో మనం కనీసం ఒక్క సన్నివేశం కూడా తీయలేమనీ, గ్రాండియర్ లుక్ మనవల్ల కాదనీ, కనీసం కలలో కూడా అలాంటి సినిమాలు వస్తాయని కానీ తీస్తామని కానీ ఊహించలేమని అనే వాళ్లు... టెక్నాలజీ అందుబాటులో లేనప్పడే 'మాయాబజార్' వంటి కళాఖండాన్ని విజయా వారు అందించారని మరచిపోకూడదు. 'సింహాసనం' సెట్స్ ఈరోజుకూ కళ్లముందు మెదులుతూనే ఉంటాయి. జనరేషన్లు మారాయి కదా...ఇప్పటి మాటేమిటి అనే వాళ్ల కోసం హాలీవుడ్ స్టయిల్ ఆఫ్ మేకింగ్ తో రిచ్ టెక్నాలజీ వాల్యూస్ తో తెలుగు ఫిల్మ్ మేకర్స్ ముందుకు వస్తుండటం ఇటీవల కాలంలో శుభ పరిణామం. నిన్నమొన్నటి 'అరుంధతి' ప్రేక్షకులను స్పెల్ బౌండ్ చేసింది. యాదృచ్ఛికమో...సంకల్పితమో కానీ 'అరుంధతి' స్మృతులు ఇంకా చెదరకుండానే ఆ సినిమాకి దగ్గర పోలికలతో పునర్జన్మల (రీబర్త్) కాన్సెప్ట్ తో 'మగధీర' ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.



రెండేళ్ల నటప్రాయం ఉన్న ఓ చిరుత 'మగధీర'గా సంచనల రికార్డులు సృష్టిస్తాడనీ, 78 ఏళ్ల తెలుగు సినీ పరిశ్రమ రికార్డులను తిరగరాస్తాడనీ సినీ పండితులు కూడా ఊహించి ఉండరు. హీరో రామ్ చరణ్ అలాంటి మిరాకిల్ సృష్టించారు. 302 డైరెక్టర్ సెంటర్లలో 50 రోజులు ప్రదర్శితమైన రికార్డు సృష్టించిన 'మగధీర' చిత్రం ఈ శనివారంతో 100 రోజులు పూర్తి చేసుకుని గత రికార్డులను బద్దలుకొట్టింది. 223 కేంద్రాలలో డైరెక్ట్ శతదినోత్సవం జరుపుకొంటున్న ఏకైక చిత్రంగా సరికొత్త రికార్డు నమోదు చేసుకుంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం 78 కోట్ల షేర్ వసూలు చేసిందనీ, శాటిలైట్ రైట్స్, రీమేక్ రైట్స్ వంటి అమ్మకాలు కూడా కలిపితే 100 కోట్లు రాబట్టుకున్న చిత్రంగా నిలుస్తుందనీ చెబుతున్నారు. ఆ ప్రకారం రోజుకు కోటి రూపాయలు రాబట్టుకున్న చిత్రంగా 'మగధీర' అసామాన్యమైన రికార్డు దక్కించుకున్నట్టే. 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందింది.











మగధీర విశ్లేషణ







రాజమౌళి ఈ స్టోరీకి మూలం ఏమిటనే పాయింట్ తో కథ మొదలుపెట్టడం ద్వారా ప్రేక్షకులలో క్యూరియాసిటీని రేకెత్తించగలిగారు. మధ్యమధ్యలో పాత్రధారులకు గతం గుర్తుకొచ్చే ఎపిసోడ్స్ చూపించి...సందర్భోచితంగా ఫ్లాష్ బ్యాక్ స్టోరీని చొప్పించడం ద్వారా కథను పట్టుగా నడిపే ప్రయత్నం కొంతమేర చేశారు. ఎక్కడైతే కథ మొదలైందో అక్కడే క్లైమాక్స్ ఘట్టం నడపే చతురత సైతం......రామ్ చరణ్ తొలి చిత్రానికీ, రెండో చిత్రానికీ స్పష్టమైన తేడా ఉంది. 'చిరుత' చరణ్ ఎంత వరకూనటించగలడో తెలుసుకునేందుకు ఉపకరిస్తే, మలి చిత్రంలో అంతా తానే అయి విశ్వరూపం చూపించే అవకాశం దక్కింది. ఇప్పటికే డాన్లు, ఫైట్స్ లో తన సత్తా చాటుకున్న చరణ్ కు ఇందులోని పీరియాడిక్ పాత్ర నిజంగానే ఓ ఛాలెంజ్ గా నిలుస్తుంది. అనుభవజ్ఞలు మాత్రమే ఇలాంటి పాత్ర పోషణకు అంగీకరిస్తారు. ఓవైపు మెగాస్టార్ వారసత్వం, మరోవైపు సొంతంగా నిలదొక్కుకోవలసిన పరిస్థితి. దీనిని చరణ్ సమర్థవంతంగానే ఎదుర్కొన్నాడు. కాలభైరవ పాత్రకు చరణ్ చక్కటి బాడీలాంగ్వేజ్ తో న్యాయం చేయ్సరు..............


COUNTER POINT
మగధీర సేన్సషనల్ హిట్ కావడంతో.......కొడుకుకీ పీద్ద కార్ కొని ఈచ్చాడు...చిరు...కానీ పాపం కొడుకుకే తండ్రి రాజకీయాలూ లో హిట్ కొడుతే అదీ అధికరంలోకే వసతీ ఏమయినా ఈధం అంటే తండ్రి గారు అసలు రాజకీయాలూ లో హిట్ కాదు కదా అవేరజీ కూడా లేదు.......బాబు చిరు మా కోసం కాదు కనీసం బహుమతి కోసం అయిన రావయ్యా......ఇదిగో వినపడుతుందా.........

0 comments:

Post a Comment

 

CinemaSeva - సినిమా సేవ Copyright © 2009 WoodMag is Designed by Ipietoon for Free Blogger Template